న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యులకు కేంద్రం త్వరలోనే ఆధునిక గ్యాడ్జెట్లను ఉచితంగా అందజేయనుంది. తమ కర్తవ్య నిర్వహణలో భాగంగా వారికి స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ప్రొజెక్టర్లు, ఇతర వేరబుల్ గ్యాడ్జెట్లను అందజేస్తారు. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం మూడేండ్లకు పైగా ఉంటే వారికి రూ.2 లక్షలు.. మూడేండ్లు, అంతకన్నా తక్కువ పదవీ కాలానికి ఉప ఎన్నిక ద్వారా ఎన్నికైన సభ్యులకు రూ.1.5 లక్షలు ఇస్తారు.
మూడేండ్ల కన్నా అదనంగా పదవీ కాలం ఉన్న వారికి అదనంగా రూ.లక్ష కేటాయిస్తారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, ప్రింటర్, స్కానర్, యూపీఎస్, స్మార్ట్‌ఫోన్ లాంటి సౌకర్యాలు పొందుతున్నారు.