న్యూఢిల్లీ, జనవరి 19: బడికివెళ్తున్న పిల్లలు తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చేదాకా చాలా మంది తల్లిదండ్రులు లోలోపల ఆందోళన పడుతుంటారు. పిల్లల భద్రత గురించి, ఎక్కడైనా తప్పిపోతారేమో అని భయపడతారు. అలాంటి వారికోసమే చైనాకు చెందిన హువావే కంపెనీ స్మార్ట్ స్కూల్ బ్యాగ్‌ను తయారు చేసింది. పిల్లలు ఉన్న లొకేషన్‌ను ఇది ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఇందులో కేవలం జీపీఎస్ ఒక్కటే కాకుండా అనేక టెక్ సదుపాయాలు ఉన్నాయి. పిల్లల కదలికలను స్మార్ట్ లైఫ్ అనే యాప్ ద్వారా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు చూడవచ్చు.