Lok Sabha Elections | ప్రతిపక్షాలు బలంగా ఉన్న చోట ఓటింగ్ ప్రక్రియను మందగించాలని ఎల్జీ ఆదేశించారు: అతిషి
Lok Sabha Elections | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి అతిషి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాను విమర్శించారు. ప్రతిపక్షాలు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుపాలని పోలీసులను ఆయన ఆదేశించినట్లు ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి అతిషి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాను విమర్శించారు. ప్రతిపక్షాలు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుపాలని పోలీసులను ఆయన ఆదేశించినట్లు ఆరోపించారు. శనివారం ఆరో దశ పోలింగ్ (Lok Sabha Elections) సందర్భంగా ఢిల్లీ మంత్రి అతిషి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఓటింగ్ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతున్నదని దుయ్యబట్టారు. ‘గత సాయంత్రం ఢిల్లీ పోలీస్ అధికారులను సమావేశానికి ఎల్జీ పిలిచినట్లు మాకు అధికారిక సమాచారం అందింది. భారత కూటమి బలమైన ప్రాంతాలలో ఓటింగ్ మందగించాలని ఢిల్లీ పోలీసులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలను ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి ఎన్నికల సంఘం దీనిని పరిగణలోకి తీసుకుంటుందని మేం ఆశిస్తున్నాం’ అని అన్నారు.
కాగా, మంత్రి అతిషి ఆరోపణలను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఖండించారు. మంత్రిగా ఉన్న వ్యక్తి రాజ్యాంగ అధికారానికి వ్యతిరేకంగా, ఎన్నికల సందర్భంగా ఇలాంటి అసమంజస ప్రకటనలు చేయడం తప్పని అన్నారు. ఓటర్లను తప్పుదోవ పట్టించడం, ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్జీ సక్సేనా హెచ్చరించారు.
#WATCH | After casting her vote for #LokSabhaElections2024, Delhi minister & AAP leader Atishi says, "I have just come after casting my vote. I appeal to all the people of Delhi to come & cast their votes…" pic.twitter.com/pbh3n5ouia
— ANI (@ANI) May 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

