న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ఇంట్లో నిద్రిస్తున్న భర్తపై భార్య మరుగుతున్న నూనెతో దాడి చేసింది. కాలిన గాయాలపై కారం పొడి చల్లింది. దవాఖాన ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఔషధ తయారీ కంపెనీలో పనిచేస్తున్న 28ఏండ్ల దినేష్‌పై అతడి భార్య అక్టోబర్ 3 తెల్లవారుజామున మరుగుతున్న నూనె పోసింది. ముఖం, మెడ, ఛాతిపై వేడి నూనె పడటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పెద్ద పెట్టున అరవటంతో ఇంటి యజమాని, పొరుగువారు ఆ ఇంటి వద్దకు చేరుకొని, దినేష్‌ను దవాఖానకు తరలించారు.