Siya Goyal | కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. సియా సోదరుడిపై పది కోట్ల పరువునష్టం దావా.. లాయర్‌తో సంబంధం లేదన్న సియా కుటుంబం
Siya Goyal : మహారాష్ట్రలోని పూనే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. అయితే, ఈ కేసు విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రధాన నిందితురాలు సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్‌పై సియా లాయర్ పరువు నష్టం దావా వేశాడు.
Siya Goyal : మహారాష్ట్రలోని పూనే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. అయితే, ఈ కేసు విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రధాన నిందితురాలు సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్‌పై సియా లాయర్ పరువు నష్టం దావా వేశాడు. సియా తరఫున వాదిస్తున్నట్లుగా చెప్పుకుంటున్న అశుతోష్ శ్రీవాస్తవ అనే లాయర్.. సాహిల్ గోయల్‌పై రూ.10 కోట్ల పరువునష్టం దావా వేశాడు. ఈ మేరకు లీగల్ నోటీస్ జారీ చేశాడు. అశుతోష్ శ్రీవాస్తవ అనే లాయర్ కొద్ది రోజులుగా మీడియాతో మాట్లాడుతున్నాడు. తనను సియా కుటుంబం ఈ కేసు వాదించేందుకు నియమించుకుందని, తానే సియా తరఫున కోర్టులో వాదిస్తానని చెప్పుకొచ్చాడు.
అయితే, అతడి ప్రకటనను సియా కుటుంబం ఖండించింది. తాము అశుతోష్ శ్రీవాస్తవను తమ తరఫున లాయర్‌గా నియమించలేదని చెప్పారు. అతడు సియాను మోసం చేసి, ఏవో కొన్ని సంతకాలు తీసుకుని ఉంటాడని సియా సోదరుడు సాహిల్ గోయల్ ఆరోపించాడు. తమకు, లాయర్ శ్రీవాస్తవకు ఏం సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. మరోవైపు శ్రీవాస్తవ.. సియా తరఫున కోర్టులో విచారణకు హాజరయ్యాడు. సియా సంతకంతో కూడిన కొన్ని డాక్యుమెంట్లను కూడా కోర్టుకు సమర్పించాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. మరో లాయర్ కూడా సియా తరఫున హాజరయ్యాడు. అతడు కూడా కొన్ని డాక్యుమెంట్లను సమర్పించాడు. సియా కోసం ఆమె కుటుంబం తనను నియమించిందని, ఆమె తరఫున వాదిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో కోర్టులో ఇద్దరు లాయర్లు సియా తరఫున తమ వాదనలు వినిపించారు.
ఇద్దరూ కలిపి వేర్వేరుగా కోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సియా గోయల్ కోర్టులో చేయెత్తింది. అశుతోష్ శ్రీవాస్తవ తన లాయర్ కాదని చెప్పింది. ఇదే సమయంలో తనపై సియా సోదరుడు చేసిన ఆరోపణలపై లాయర్ శ్రీవాస్తవ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడు చేసిన ఆరోపణల వల్ల తన వృత్తి పరమైన గుర్తింపు దెబ్బతిందని, తన పరువుకు భంగం కలిగిందని ఆరోపిస్తూ.. సాహిల్ గోయల్‌కు రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేసి, నోటీసు పంపించాడు. కేతన్ హత్య కేసులో నిందితులు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు. జూలై 3 వరకు వీరి రిమాండ్ కొనసాగనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

