Terrorists conspiracy: ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఇద్దరు పాక్ ఉగ్రవాదులు సహా ఆరుగురు అరెస్ట్
Terrorists conspiracy: దేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు ఉగ్రవాదులు చేసిన భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వాళ్లలో ఇద్దరు

న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసానికి పాల్పడేందుకు ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. చాకచక్యంగా వ్యవహరించి మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లలో ఇద్దరు పాకిస్థాన్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన ఉగ్రవాదుల నుంచి భారీగా పేలుడు పదార్థాలు, మందుపాతరలు, మారణాయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ కుశ్వాహా చెప్పారు.
ఇంటెలిజెన్స్ హెచ్చరికల మేరకు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ప్రయాగ్రాజ్, ఢిల్లీలో సోదాలు నిర్వహించి ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన ఆరుగురిలో ఒసామా, జీశన్ అనే ఇద్దరు పాకిస్థాన్లో శిక్షణ పొందినట్లు చెప్పారు. ఆ ఇద్దరినీ ప్రయాగ్రాజ్లో అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్లాన్ చేశారని పోలీసులు చెప్పారు. దసరా నవరాత్రులు, ఇతర పండుగల సందర్భంగా మందుపాతరలు, మారణాయుధాలతో విధ్వంసానికి పాల్పడేందుకు కుట్ర జరిగిందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

