బీఎస్ఎఫ్ అదుపులో ఆరుగురు పాక్ జాతీయులు… 11 బోట్లు సీజ్
అహ్మదాబాద్: పడవల్లో గుజరాత్ తీరానికి వచ్చిన పాక్ జాతీయులను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 11 బోట్లను సీజ్ చేశారు. ఆరుగురు పాక్ జాతీయులను పట్టుకున్నారు. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 9న బుజ్లోని హరామీ నల్లా ప్రాంతానికి పలు పడవల్లో కొందరు పాక్ మత్స్యకారులు వచ్చారు. దేశంలోకి చొరబడేందుకు వారు ప్రయత్నించారు.
అయితే రాత్రి వేళ గస్తీ నిర్వహించే బీఎస్ఎఫ్ జవాన్లు దీనిని గ్రహించారు. డ్రోన్‌తో ఫొటోలు తీయగా కొన్ని పాక్ బోట్లు కనిపించాయి. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లు బృందాలుగా ఏర్పడి హెలీకాప్టర్లలో ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. పలు చోట్ల దాక్కున్న ఆరుగురు పాక్ మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. 11 బోట్లను సీజ్ చేశారు.
మరింత మంది పాక్ జాతీయులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భారత మత్స్యకారులను ఆ ప్రాంతంలోకి అనుమతించలేదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

