Vande Bharat | రాంచీ: దేశంలో మరో ఆరు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. జార్ఖండ్, ఒడిశా, బీహార్, యూపీల నుంచి నడిచే ఈ రైళ్లను ప్రధాని మోదీ ఆదివారం రాంచీ విమానాశ్రయం నుంచి వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. వాస్తవానికి ఈ రైళ్లను ఆయన టాటానగర్ స్టేషన్ నుంచి ప్రారంభించాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించక ఆయన హెలికాప్టర్ బయలుదేరలేదు.
ఈ కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్లు టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా రూట్లలో నడుస్తాయి. డియోఘర్, వారణాసి, కాళీఘాట్, బెలూర్ మఠం (కోల్కతా) తదితర పుణ్యస్థలాలకు వెళ్లేందుకు ఈ రైళ్లు ఎంతో ఉపయోగపడతాయని రైల్వే శాఖ తెలిపింది.