న్యూఢిల్లీ: ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న హుమయూన్ సమాధి కాంప్లెక్స్‌లో ఉన్న దర్గాలో గోడ కూలిన ప్రమాదంలో ఆరుగురు సందర్శకులు మరణించారు. శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శిథిలాల కింద ఏడుగురు సందర్శకులు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే హుటాహుటిన చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది శిథిలాల కింద ఉన్న 11 మందిని బయటకు తీసి సమీపంలోని దవాఖానకు తరలించారు. మిగిలిన వారిని వెలికి తీయడానికి రక్షణ చర్యలు చేపట్టారు. హుమయూన్ సమాధి కాంప్లెక్స్‌ను నిత్యం వందలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు.