లక్నో, జూన్ 15: ఉత్తరప్రదేశ్లోని మథురలో ఆదివారం తవ్వకం పనులు జరుపుతుండగా, పునాదులు కదిలి ఆరు ఇండ్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు అనుమానిస్తున్నారు.
షాగంజ్ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే మాయా తీలా అనే ప్రాంతంలో గుట్టలాంటి ఎత్తయిన ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా, చుట్టుపక్కల ఉన్న పలు ఇండ్లు, భవనాల పునాదాలు దెబ్బతిన్నాయని, ఒక్కసారిగా ఆరు ఇండ్లు కుప్పకూలాయని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, మృతుల్లో ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లు అని పేర్కొన్నారు.