Train accident : ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) లోని బిలాస్పూర్ (Bilaspur) లో ఘోర రైలు ప్రమాదం (Train accident) జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న కోర్బా ప్యాసింజర్ రైలు.. జయరామ్ నగర్ స్టేషన్ వద్ద ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్ ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మృతదేహాలను ట్రెయిన్ నుంచి వెలికితీశాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో ఆస్పత్రులకు తరలించాయి. ఘటనా ప్రాంతంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.