జామ్తారా: కృత్రిమ మేధ సహకారంతో ఇంటర్నెట్ ద్వారా ప్రజల్ని మోసం చేస్తున్న ఆరుగురు సైబర్ నేరగాళ్ల(Cyber Criminals)ను జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. జామ్తారా జిల్లాలో వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఆ సైబర్ నేరగాళ్లు నిపుణులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్లు మాల్వేర్ను డెవలప్ చేస్తున్నారు. డీకే బాస్ పేరుతో వాళ్లు సైబర్ ఆపరేషన్ కొనసాగించారు. ఆ నేరగాళ్ల వద్ద నుంచి అనేక మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఏటీఎం కార్డులు, డ్రోన్, హై రెజల్యూషన్ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సృష్టించిన వెబ్సైట్ నుంచి సుమారు 2700 మంది డేటాను సేకరించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.