BJP | బీజేపీకి అసమ్మతి సెగ.. 100 సీట్లలో అభ్యర్థులను మార్చాలంటూ ఆందోళనలు
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400కుపైగా స్థానాల్లో విజయం సాధించాలని ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించగా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పార్టీ అధిష్ఠానం ప్రకటించిన అభ్యర్థులపై కార్యకర్తలు తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులకు వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీచేస్తున్నారు.
- పార్టీకి వ్యతిరేకంగా కరపత్రాల పంపిణీ
- గుజరాత్ సహా పలు రాష్ర్టాల్లో వ్యతిరేకత
BJP | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400కుపైగా స్థానాల్లో విజయం సాధించాలని ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించగా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పార్టీ అధిష్ఠానం ప్రకటించిన అభ్యర్థులపై కార్యకర్తలు తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులకు వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీచేస్తున్నారు. దాదాపు 100 సీట్లలో రెబల్స్ తిరుగుబాటుకు దిగారు. మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్‌తో పాటు హర్యానా, రాజస్థాన్, బీహార్, కర్ణాటక, ఆంధ్రపదేశ్, తెలంగాణల్లో కూడా అభ్యర్థుల ప్రకటనతో తీవ్ర వ్యతిరేకత నెలకొంది.
103 మంది సిట్టింగ్‌లకు మొండి చేయి
బీజేపీ ఇప్పటివరకు 407 సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే, అందులో 103 మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఇవ్వలేదు. దీంతో వారిలో చాలామంది ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. తమను కాదని రాత్రికి రాత్రి పార్టీ మారి వచ్చి చేరిన ఇతర నాయకులకు టికెట్లు కేటాయించడంపై పలు చోట్ల కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. గుజరాత్లో 14 మంది సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో అసమ్మతి నెలకొంది.
రెబల్స్‌గా బరిలోకి..
80 లోకసభ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లో 9 సిట్టింగ్ ఎంపీలకు టికెటివ్వలేదు. మధ్యప్రదేశ్‌లో 9, ఢిల్లీలో ఆరుగురు, ఒడిశాలో నలుగురు (21 సీట్లు), బీహార్‌లో ముగ్గురు (40 సీట్లు), ఛత్తీస్‌గఢ్‌లో 9 మంది (11 సీట్లు), రాజస్థాన్‌లో 10 (25 సీట్లు), మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు ప్రకటించిన 24 సీట్లలో 10 సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వలేదు. హర్యానాలో 10 సీట్లలో సిట్టింగ్‌లను మార్చి కొత్తవారిని రంగంలోకి దించడంతో కార్యకర్తల్లో అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తున్నది. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. కర్ణాటకలో 10 మంది సిట్టింగ్‌లకు టికెట్లు కేటాయించలేదు. అంతేకాదు మరో 10 సీట్లలో అసంతృప్త బీజేపీ నాయకులే రంగంలో ఉన్నారు.
తెలుగు రాష్ర్టాల్లోనూ..
ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా తెలుగుదేశం, జనసేనలతో పొత్తు మూలంగా పలు చోట్ల టికెట్లు ఆశించి భంగపడ్డ బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. బీజేపీకి 6 లోకసభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించడంతో అక్కడ టికెట్లు కోల్పోయిన నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణలో కూడా సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మినహా అన్ని చోట్లా అసంతృప్తి సెగలు రేగాయి. హైదరాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్, జహీరాబాద్, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ లోకసభ సీట్లలో కూడా చాలా వ్యతిరేకత కనిపిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

