న్యూఢిల్లీ, జూలై 19: అయోధ్య రామమందిర విరాళాల్లో అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న ‘సిట్’, తన తాజా నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం మళ్లీ విచారణ జరుపనున్నది. జూలై 13 నాటి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, దర్యాప్తునకు సంబంధించిన తాజా నివేదికను ఒక సీల్డ్ కవర్లో సిట్ అందజేసింది. ఈ వ్యవహారంలో ఓ వైపు సిట్ విచారణ సాగుతుండగా, మరోవైపు నిర్మోహి అఖారా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రామమందిర ట్రస్ట్‌లో జవాబుదారీతనం కొరవడిందని, దీనిని పునర్వ్యవస్థీకరించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.