GDP | దేశ ఆర్థిక వృద్ధిని 7.1 శాతంగా అంచనా వేసిన వరల్డ్ బ్యాంక్..!
GDP | దేశ ఆర్థికవ్యవస్థ (India Economy) వృద్ధిపై ప్రపంచ బ్యాంకు (World Bank) సానుకూల అంచనాలను వెలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (FY2026-27) గాను భారత జీడీపీ వృద్ధిరేటు (GDP growth) అంచనాను 7.1 శాతానికి పెంచుతున్నట్లు మంగళవారం (Tuesday) ప్రకటించింది. గత ఏప్రిల్‌లో ఈ వృద్ధి అంచనా 6.6 శాతం ఉండగా.. తాజాగా దానిని 0.5 శాతం మేర సవరించింది.
GDP : దేశ ఆర్థికవ్యవస్థ (India Economy) వృద్ధిపై ప్రపంచ బ్యాంకు (World Bank) సానుకూల అంచనాలను వెలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (FY2026-27) గాను భారత జీడీపీ వృద్ధిరేటు (GDP growth) అంచనాను 7.1 శాతానికి పెంచుతున్నట్లు మంగళవారం (Tuesday) ప్రకటించింది. గత ఏప్రిల్‌లో ఈ వృద్ధి అంచనా 6.6 శాతం ఉండగా.. తాజాగా దానిని 0.5 శాతం మేర సవరించింది. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు అంచనాలను మించి 7.8 శాతంగ నమోదుకావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన తాజా ‘ఇండియా డెవలప్మెంట్ అప్డేట్’ నివేదికలో ప్రపంచ బ్యాంకు స్పష్టంచేసింది.
గత ఆర్థిక సంవత్సరంలో బలమైన పెట్టుబడులు, స్థిరమైన ప్రైవేట్ వినియోగం కారణంగా వృద్ధిరేటు 7.8 శాతానికి చేరుకుందని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది. ఇదే ఒరవడి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతున్నదని, వృద్ధికి ప్రైవేట్ వినియోగమే ప్రధాన చోదకశక్తిగా నిలుస్తుందని విశ్లేషించింది. వీటికి తోడు అంచనాల కంటే మెరుగ్గా రాణిస్తున్న ఎగుమతులు కూడా ఆర్థికవృద్ధికి మరింత ఊతమిస్తాయని వివరించింది.
రంగాల వారీగా విశ్లేషిస్తే పారిశ్రామిక రంగం ముందస్తు అంచనాలను మించి రాణిస్తోందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. తొలి త్రైమాసికంలో విద్యుత్ రంగం 9.3 శాతం, మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాలు 7.2 శాతం వృద్ధిని సాధించాయి. అయితే నైరుతి రుతుపవనాల లోటు కారణంగా వ్యవసాయ రంగం పనితీరు కొంత బలహీనంగా ఉండే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.
ఆగస్టు వరకు వర్షపాతం తక్కువగా నమోదు కావడం గ్రామీణ డిమాండ్‌పై స్వల్ప ప్రభావాన్ని చూపవచ్చని అభిప్రాయపడింది. అంతర్జాతీయ అనిశ్చితుల దృష్ట్యా ప్రైవేట్ పెట్టుబడులపై ప్రభావం పడవచ్చని, ఫలితంగా ప్రభుత్వ వ్యయం కొంత మేర తగ్గే అవకాశం ఉందని నివేదిక పేర్కొన్నది. అయినప్పటికీ పటిష్ఠమైన ప్రభుత్వ పెట్టుబడులు, అనుకూల ఆర్థిక విధానాలు ఈ లోటును భర్తీ చేస్తాయని విశ్లేషించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | బహిష్కృత జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ.. డిసెంబర్ 1 లోగా లొంగిపోవాలని ఆదేశం
Cult Review | ‘కల్ట్’ సినిమా రివ్యూ.. విశ్వక్సేన్ కొత్త సినిమా ఎలా ఉందంటే!
Inter Student | అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Rise | రూ.100 చేరువలో కిలో బియ్యం..! సామాన్య ప్రజల రక్తం తాగుతున్న రైస్ మాఫియా
Soil Fertility | భూసారాన్ని కాపాడితేనే భవిష్యత్ ..వ్యవసాయానికి భరోసా
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

