Zubeen Garg : అస్సాం గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) అకాల మరణంపై సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. సింగపూర్‌లో స్కూబా డైవింగ్ ప్రమాదంలో జుబీన్ మృతి చెందడంతో.. అతడితో పాటు ఆ సమయంలో ఉన్న వాళ్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే జుబీన్ మేనేజర్ ఇంట్లో సోదాలు జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. గురువారం మ్యూజిషియన్ శేఖర్ జ్యోతి గోస్వామిని అదుపులోకి తీసుకుంది. సింగర్‌తో పాటు పడవలో ట్రిప్ వెళ్లిన వాళ్లలో శేఖర్ కూడా ఉండడమే అందుకు కారణం. అయితే.. అతడిని ఏ ఆరోపణల కింద అరెస్ట్ చేశారు? అనేది మాత్రం వెల్లడించలేదు. కానీ, అతడిని విచారిస్తే స్కూబా డైవింగ్ ప్రమాదంపై స్పష్టత వస్తుందని సిట్ భావిస్తోంది.
అస్సామీల ఫేవరెట్ రాక్‌స్టార్ అయిన జుబీన్ సెప్టెంబర్ 19న స్కూబా డైవింగ్ ప్రమాదంలో కన్నుమూశాడు. ఆయన ఆకస్మిక మరణంపై అస్సాం ప్రభుత్వం నిజానిజాలను వెలుగులోకి తేవాలనుకుంటోంది. అందుకోసం డీజీపీ ఎంపీ గుప్తా నేతృత్వంలో 10 మందితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. జుబీన్ సన్నిహితులు, మేనేజర్ సహ అనుమానితులపై సిట్ దృష్టి సారించింది.
Human Ocean walking with their beloved Singer Zubeen Garg… A phenomenon, very rare. He has occupied a place in our hearts probably very few have in our generation. Art can change people, society, a nation… He became a melodious expression of unspoken, inarticulate feelings of… pic.twitter.com/wmn1Kptv9z
— Adil hussain (@_AdilHussain) September 21, 2025
మేనేజర్ సిద్ధార్ధ్ శర్మకు చెందిన గువాహటిలోని నివాసాల్లో సోదాలు చేశారు అధికారులు. అంతేకాదు ఎంటర్ప్రెన్యూర్, సాంస్కృతిక ఉద్యమకారుడు శ్యకంకను మహంతాపై కూడా సిట్ నిఘా పెట్టింది. సెప్టెంబర్ 21న నిర్వహించిన జుబీన్ అంతిమ యాత్రలో భారీగా అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలు, గన్ సెల్యూట్‌తో అంత్యక్రియలు జరిపింది.