న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. 2021-22 నాటి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదర్కొంటున్న మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియడంతో.. దర్యాప్తు అధికారులు ఇవాళ ఉదయం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఆయనను హాజరుపర్చారు.
కేసుకు సంబంధించి సిసోడియా నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని, కాబట్టి ఆయన కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాలని ఈడీ అధికారులు కోరారు. ఈ నేపథ్యంలో కోర్టు సిసోడియా కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అధికారులు గత ఫిబ్రవరిలో మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేశారు. దర్యాప్తు అనంతరం ఆయనను తీహార్ జైల్లో పెట్టారు.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు గత మార్చి 9న తీహార్ జైలు నుంచి సిసోడియాను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పలుమార్లు ఆయన కస్టడీని పొడిగిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
#WATCH Former Delhi Deputy CM Manish Sisodia brought to Rouse Avenue Court at the end of his judicial custody in the ED case of excise policy matter pic.twitter.com/r3NJSNwdSI
— ANI (@ANI) May 8, 2023