గువాహటి: అస్సాంలోని డిబ్రూగఢ్ పోలీసులు 11 అరుదైన టోకే గెక్కో బల్లులను శుక్రవారం స్వాధీ నం చేసుకుని, ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వీటిలో ఒక్కొక్క దానిని రూ.60 లక్షల చొప్పున విక్రయించాలనుకున్నట్లు వీరు దర్యాప్తులో తెలిపారు. వీటిని అరుణాచల్‌ప్రదేశ్ నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు. టోకే గెక్కో బల్లులు అంతరించిపోయే ప్రమాదం గల జీవుల జాబితాలో ఉన్నాయి. వీటికి వన్య ప్రాణుల పరిరక్షణ చట్టం ప్రకారం రక్షణ ఉంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ర్టాల్లోని కొన్ని చోట్ల మాత్రమే ఇవి కనిపిస్తాయి.