Pawan Singh : భోజ్‌పురి గాయకుడు (Bhojpuri singer), నటుడు పవన్ సింగ్ (Pawan Singh) ఇవాళ (మంగళవారం) కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) ను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ను కలిశారు. బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ అతను బీజేపీ అగ్రనేతలను కలవడంతో మళ్లీ బీజేపీలో చేరుతున్నారా, బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగబోతున్నారా..? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
పవన్ సింగ్ గతంలోనే బీజేపీ చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అతడు కరాకట్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగాలని భావించారు. కానీ పొత్తుధర్మంలో భాగంగా అక్కడ బీజేపీకి పోటీచేసే అవకాశం దొరకలేదు. ఈ క్రమంలో పవన్ సింగ్ ఇండిపెండెంట్‌గా పోటీచేశారు. దాంతో బీజేపీ అతడిని పార్టీ నుంచి బహిష్కరించింది. అటు కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి చేతిలో పవన్ సింగ్ ఓడిపోయారు. ఎన్డీఏ తరఫున పోటీచేసిన RLM చీఫ్ ఉపేంద్ర కుశ్వాహాకు మూడో స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో ఇవాళ పవన్ సింగ్ బీజేపీ అగ్రనేతలను కలవడం చర్చనీయాంశమైంది.
పవన్ సింగ్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతారా.. అందుకే ఆయన ఇవాళ బీజేపీ నేతలను కలిశారా..? అనే చర్చ జరుగుతోంది. భోజ్‌పూర్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆయన ఎక్కడి నుంచి బరిలో దిగుతారు అనే చర్చ కూడా మొదలైంది. ఆరా లేదా బర్హారా నుంచి ఆయన బరిలో దిగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.