న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఆతిథ్యరంగంలో మానవ వనరుల కొరతతో సింగపూర్ రెస్టారెంట్స్ సతమతమవుతున్నాయి. దీంతో అక్కడి రెస్టారెంట్స్ భారతీయ పాకశాస్త్ర నిపుణుల్ని నియమించుకోవటంలో నిబంధనల్ని సడలిస్తూ సింగపూర్ కీలక నిర్ణయం తీసుకున్నది. సేవలు, తయారీరంగంలో వృత్తి నిపుణులను పెద్ద ఎత్తున నియమించేందుకు ‘వర్క్ పర్మిట్ హోల్డర్’ వీసాలను జారీచేయబోతున్నట్టు సింగపూర్‌లోని సంబంధిత మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారతీయ వంట మాస్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.