Zubeen Garg | సింగర్ జుబీన్ గార్గ్ మరణంలో ఎలాంటి కుట్ర లేదు.. సింగపూర్ కోర్ట్ స్పష్టం
Zubeen Garg : సింగపూర్‌లో అనుమానాస్పదంగా మరణించిన భారతీయ సింగర్ జుబీన్ గార్గ్ మృతిలో ఎలాంటి కుట్ర లేదని సింగపూర్ కోర్టు తెలిపింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెల్లడించింది.
Zubeen Garg : సింగపూర్‌లో అనుమానాస్పదంగా మరణించిన భారతీయ సింగర్ జుబీన్ గార్గ్ మృతిలో ఎలాంటి కుట్ర లేదని సింగపూర్ కోర్టు తెలిపింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెల్లడించింది. జుబీన్ గార్గ్ మరణం హత్య అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. ఒక కల్చరల్ ప్రోగ్రాంలో ప్రదర్శన ఇచ్చేందుకు సింగపూర్ వెళ్లిన భారతీయ సింగర్ జుబీన్ గార్గ్ సెప్టెంబర్ 19, 2025న అనుమానాస్పదంగా మరణించారు. ఒక చిన్న పడవలోంచి సముద్రంలో పడి మునిగిపోయి, మరణించాడు.
అయితే, జుబీన్ మృతిపై అతడి భార్య గరిమా సైకియా గార్గ్ అనుమానం వ్యక్తం చేశారు. అతడి మృతి వెనుక కుట్ర కోణం ఉండొచ్చని తెలిపింది. దీంతో ఈ కేసుపై సింగపూర్‌కు చెందిన పోలీస్ కోస్ట్ గార్డ్స్ (పీసీజీ) బృందం విచారణ చేసింది. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం.. అతడు పడవ ఎక్కేముందు ఆల్కహాల్ తీసుకున్నాడు. అలాగే, నిలకడలేకుండా మత్తులో ఉన్నాడు. పడవ ఎక్కేముందు అతడు లైఫ్ జాకెట్ ధరించినప్పటికీ, తర్వాత ఎప్పుడో తీసేశాడు. ఈ క్రమంలో పడవలోంచి నీళ్లలోపడి మునిగిపోయాడు. అతడు ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయాడని, ఎవరూ తోసేయలేదని, ఎలాంటి కుట్ర లేదని పీసీజీ కోర్టుకు తెలిపింది. అలాగే, స్విమ్మర్లు కూడా అతడిని రక్షించి, అతడి ముఖాన్ని నీళ్లలో ముంచారనడానికి కూడా సరైన ఆధారాలు లేవన్నారు. ఇక, ప్రభుత్వ వైద్యులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. రాష్ట్ర వైద్యాధికారి ఆడమ్ నఖోడా కూడా జుబీన్ నీటిలో మునిగిపోవడం వల్లే మరణించినట్లు కోర్టుకు తెలిపారు. ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదన్నారు.
పీసీజీ దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిందన్నాడు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. ఇండియా-సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడి 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు జుబీన్ సింగపూర్ వెళ్లాడు. ఈ క్రమంలో అతడు మరణించాడు. దీంతో ఈ ప్రోగ్రాంను నిర్వాహకులు రద్దు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

