న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ర్టాల శాసనసభలకు 2029లో ఏకకాల ఎన్నికలు సాధ్యం కావని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం పేర్కొన్నారు. ప్రభుత్వం మొండిగా ఈ బిల్లుపై ముందుకు వెళితే తమ పార్టీ దేశవ్యాప్త నిరసన చేపడుతుందని హెచ్చరించారు. జమిలి ఎన్నికలు సాధ్యమేనన్న సంబంధిత బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చైర్మన్ పీపీ చౌదరి వ్యాఖ్యలపై చిదంబరం ఎక్స్‌లో స్పందించారు.
‘ఆయన బిల్లును చూసిన తీరు విరుద్ధంగా ఉండటం చూసి నేను భయపడ్డాను. బిల్లు పాసైనప్పటికీ ‘నిర్ణీత తేదీ(అపాయింటెడ్ డేట్)’ సార్వత్రిక ఎన్నికల తర్వాత మాత్రమే ఉండగలదు. తదుపరి సార్వత్రిక ఎన్నికలు 2029లో జరుగుతాయి. అందువల్ల 2029లో ఏక కాల ఎన్నికలు సాధ్యం కావు’ అని చిదంబరం వ్యాఖ్యానించారు.