భువనేశ్వర్: ఒడిశాలోని పూరీ జగన్నాథుని దేవాలయంలో అన్ని (4) తలుపులను తిరిగి తెరిచారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఆయన మంత్రివర్గ సహచరుల సమక్షంలో గురువారం ఉదయం 6.30 గంటలకు వీటిని తెరిచారు. భక్తులు ఈ నాలుగు మార్గాల్లోనూ వెళ్లి, శ్రీ జగన్నాథుని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. 12వ శతాబ్దంనాటి ఈ దేవాలయంలోని మూడు తలుపులను కొవిడ్-19 మహమ్మారి వచ్చినప్పటి నుంచి మూసివేశారు.