Captain Amarinder Singh | పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ మరోమారు పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోతి సింగ్ సిద్ధూపై నిప్పులు చెరిగారు. సిద్ధూలో నిలకడ లేదని కెప్టెన్ అమరిందర్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట్ర సీఎంగా వైదొలిగిన 45 రోజుల తర్వాత మంగళవారం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాస్తూ తన మనస్సును పార్టీ గాయ పరిచిందని వ్యాఖ్యానించారు.
సిద్ధూకు పాకిస్థాన్‌తో లింక్‌లు ఉన్నాయని ఆరోపించారు. కానీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్రమ ఇసుక మైనింగ్‌లో పాల్గొంటున్నారని చెప్పారు. వారి వివరాలు బయటపెడతానని వెల్లడించారు. తాను ఇప్పటికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే చిక్కులు తప్పవని చెప్పారు.