కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు సమన్లు
బెంగళూరు : కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యకు కర్నాటక అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమన్లు జారీ చేసింది. మేకేదాటు పాదయాత్రతో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, ఈ మేరకు ఈ నెల 24న మేజిస్ట్రేట్ ముందు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి కొవిడ్ ఆంక్షలు ఉన్నప్పటికీ.. హెచ్చరికలు జారీ చేసినా ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్ పది రోజుల పాటు మేకేదాటు పాదయాత్రను నిర్వహించింది. ‘మన నీరు – మనహక్కు’ అనే అంశంతో డీకే శివకుమార్‌తో కలిసి సిద్ధరామయ్య పాదయాత్రలో పాల్గొన్నారు.
రామనగర జిల్లా కనకపురలో కావేరి, అర్కావతి నదుల సంగమ ప్రాంతం వద్ద పాదయాత్ర ప్రారంభమైంది. 139 కిలోమీటర్ల దూరం వరకు కొనసాగిన యాత్ర కనకపుర, రామనగర, బిడాడి మీదుగా బెంగళూరులోని బసవనగుడి వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా.. రాష్ట్ర కాంగ్రెస్ ఆగస్ట్ 9న మరో పాదయాత్రను నిర్వహించనున్నది. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పాదయాత్ర జరుగనున్నది. కల్యాణ కర్ణాటక, కిత్తూరు కర్ణాటక, కోస్టల్ కర్ణాటక, మల్నాడ, ఓల్డ్ మైసూర్ తదితర ప్రాంతాల గుండా పాదయాత్ర సాగుతుంది. యాత్రకు కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే నేతృత్వం వహించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

