బెంగళూరు: మైసూర్ దసరా ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన వేడుకలో సీఎం సిద్ధరామయ్యకు తీరు అందర్నీ నివ్వెరపర్చింది. సభలో తాను మాట్లాడటానికి సిద్ధమవుతుండగా.. ప్రేక్షకుల్లో కొంతమంది అక్కడ్నుంచి వెళ్లిపోవటంతో, వాళ్లను చూసి సీఎం సిద్ధరామయ్య ఆగ్రహంతో ఊగిపోయారు. ఏయ్ పోలీస్.. వాళ్లను ఆపండయ్యా అంటూ అరిచారు.
‘ఎవరయ్యా అక్కడ?నేను ఒక్కసారి చెబితే.. మీకు అర్థం కావటం లేదా.. కూర్చోండి. కొద్దిసేపు కూర్చోలేరా? అలా అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు. ఇంట్లోనే ఉండిపోవాల్సింది’ అని ప్రేక్షకుల్లో కొంతమందిని ఉద్దేశించి అన్నారు. మైసూర్ దసరా వేడుకలను బుకర్ ప్రైజ్ గ్రహీత బాను ముస్తాక్ ప్రారంభించడం కర్ణాటకలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. హిందూ వ్యతిరేక, కన్నడ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వ్యక్తి చేతుల మీదుగా ఈ వేడుకలను ప్రారంభోత్సవం చేయటమేంటని విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.