బెంగళూరు: సీఎం సిద్ధరామయ్య భూ కుంభకోణంలో పూర్తిగా కూరుకుపోయారని, ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు. ‘ముడా’ చైర్మన్ కే మరిగౌడ తాజాగా తన పదవి నుంచి తప్పుకోవటం సంచలనంగా మారింది.
బుధవారం న్యూఢిల్లీలో ఎంపీ సంబిత్ పాత్ర విలేకర్లతో మాట్లాడుతూ, ‘సీఎం భార్య ‘ముడా’ భూములు తిరిగిచ్చేయటం, ‘ముడా’ చైర్మన్ రాజీనామా వంటి అంశాలు పరిశీలిస్తే, సిద్ధ్దరామయ్య కుంభకోణంలో పూర్తిగా కూరుకుపోయారు. ‘ముడా’ చైర్మన్ తన పదవికి రాజీనామా చేశారు. ఏ మాత్రం నైతికత ఉన్నా సిద్ధరామయ్య కూడా తన పదవిని వీడాలి’ అని సంబిత్ పాత్ర అన్నారు.