బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాకస్ధాయికి చేరడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో తలమునకలవుతుంటే కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) తన స్వగ్రామంలో చిన్ననాటి స్నేహితులతో ఆహ్లాదంగా గడిపారు. మైసూర్ సమీపంలోని సిద్దరమయన హుంది గ్రామంలో సిద్ధరామయ్య బాల్య స్నేహితులతో సందడి చేశారు. గ్రామస్తులు, స్నేహితులతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు.
This was @siddaramaiah ji dancing with his childhood friends at his native village Siddaramayyana hundi in Mysuru, natives folk dance.. 🔥 pic.twitter.com/Iu97ZHfK8S
— Niraj Bhatia (@bhatia_niraj23) May 7, 2023
సిద్ధరామయ్య డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరోవైపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గరపడటంతో ప్రధాన పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాషాయ పాలనలో కర్నాటకలో ఎటు చూసినా స్కామ్లే కనిపిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం అనెకల్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు రూ. 8 కోట్లతో పట్టుబడగా, మరో బీజేపీ ఎమ్మెల్యే సీఎం పదవిని రూ. 2500 కోట్లతో కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారని మండిపడ్డారు.
కర్నాటకలో అవినీతి గురించి ఇవాళ ఆరేండ్ల బాలుడికి కూడా తెలుసన్నారు. గత మూడేండ్ల బీజేపీ పాలనలో విచ్చలవిడిగా పెరిగిన అవినీతి గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడాలని రాహుల్ నిలదీశారు. కర్నాటకలో డబుల్ ఇంజిన్ సర్కార్లో ఏ ఇంజన్ 40 శాతం కమీషన్ను తినేసిందో ప్రధాని మోదీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఇక మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More
IRCTC OOTY Tour | మండు వేసవిలో ఊటీ ట్రిప్.. ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ