IRCTC OOTY Tour | మండు వేసవిలో ఊటీ ట్రిప్.. ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
Hyderabad to Ooty | దేశంలోని బెస్ట్ టూరిస్ట్ హిల్ స్టేషన్స్ లో ప్రముఖంగా చెప్పుకోదగ్గది 'ఊటీ'. సమ్మర్ వచ్చిందంటే చాలు ఎండ వేడిమి తట్టుకోలేక ఈ ప్రాంతానికి క్యూకడుతుంటారు పర్యాటకులు. వేసవిలోనే కాదు, శీతాకాలంలో కూడా పర్యాటకులు ఊటీకి వెళుతుంటారు. అయితే ఊటీ వెళ్లే సందర్శకుల కోసం ఐఆర్సీటీసీ (IRCTC) ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది.
IRCTC OOTY Tour | సమ్మర్ వచ్చిందంటే చాలు… వేర్వురు సరికొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు పర్యాటకులు..! కొందరు సేద తీరే ప్రాంతాలను ఎంచుకుంటే… మరికొందరు అధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లాలని చూస్తారు. అయితే అలాంటి వారికోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) గుడ్ న్యూస్ చెప్పింది. అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ పేరిట హైదరాబాద్ నుంచి ఊటీ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పూర్తి వివరాలను ప్రకటించింది.
అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ (ULTIMATE OOTY EX HYDERABAD) పేరుతో ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. మే 9 నుంచి ఈ ప్యాకేజీని ( Tour Package) బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో ఊటీ(OOTY), కున్నూర్(Kunnru), బొటానికల్ గార్డెన్స్(Botanical gardens), ఊటీ లేక్(Ooty Lake) దొడబెట్ట పీక్ (Dodabetta), టీ మ్యూజియం (Tea Museum), పైకారా జలపాతం (Pykhara Falls) తదితర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 5 రాత్రులు, 6 రోజులు కొనసాగుతుంది. మే 9 నుంచి వారానికోసారి (మంగళవారం) సికింద్రాబాద్ నుంచి తమిళనాడుకు రైలు (శబరి ఎక్స్‌ప్రెస్) అందుబాటులో ఉంటుంది.
ప్రయాణం సాగుతుంది ఇలా
Day 01: మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణించాల్సి ఉంటుంది.
Day 02: రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్(Railway Station) కు వెళ్తారు. అక్కడ నుంచి ఊటీకి తీసుకెళ్తారు. హోటల్లో చెకిన్ అవ్వాలి. తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ ను చూపిస్తారు. రాత్రి భోజనం, ఊటీలో బస ఉంటుంది.
Day 03: మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి దొడబెట్ట పీక్, టీ మ్యూజియం(Tea Museum), పైకారా ఫాల్స్ సందర్శనకు వెళ్తారు. రాత్రికి ఊటీలో బస చేయాలి.
Day 04: నాలుగో రోజు కూనూర్ సందర్శనకు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే భోజనం చేసి బస చేయాలి.
Day 05: ఐదో రోజు ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అక్కడ నుంచి కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు పర్యాటకులను తీసుకువెళతారు. మధ్యాహ్నం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. రాత్రి మెుత్తం జర్నీ చేయాలి.
Day 05: ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ ఊటీ టూర్ ప్యాకేజీ ధర (Ooty Tour Package)
ఇక చార్జీల విషయానికి వస్తే.. స్టాండర్డ్ ప్యాకేజీలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ. 28,950 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.15,220, ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.11,870. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.14,330, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.17,670, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.31,410గా చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్సీటీసీ తెలిపింది. 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు ఈ ధరలే అందుబాటులో ఉంటాయి. ఈ టూర్ ప్యాకేజీలో ట్రైన్ టికెట్లు, హోటల్లో బస, బ్రేక్‌ఫాస్ట్ (మధ్యాహ్నం పూట భోజనం, రాత్రి భోజనం యాత్రికులే చూసుకోవాలి). ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
పూర్తి వివరాల కోసం.. IRCTC క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR094
Read Today's Latest Tourism News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

