Siddaramaiah | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ఫలితాల్లో (Results) కాంగ్రెస్ (Congress) స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతోంది. 120 పైగా స్థానాల్లో గెలుస్తామని హస్తం పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు గెలుపు సంబరాల్లో మునిగిపోయాయి. ఇలాంటి సమయంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి శివమ్మ భర్త రమే గౌడ (69) (Rame gowda) శనివారం కన్నుమూశారు.
శనివారం ఉదయం రమే గౌడ అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన మైసూరులోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రమే గౌడ మరణంతో సిద్ధరామయ్య కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రామే గౌడకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read..
Karnataka Assembly Election Results 2023 | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్
Siddaramaiah | 120 సీట్లకుపైగా గెలుస్తాం.. సొంత బలంతోనే అధికారంలోకి వస్తాం : సిద్ధరామయ్య
Karnataka Results | కర్ణాటకలో కాంగ్రెస్ హవా.. ఓటమి అంచున బీజేపీ