ముంబై, డిసెంబర్ 24: దర్శక దిగ్గజం, సమాంతర సినిమాకు ఆద్యుడు శ్యామ్ బెనెగల్కు మంగళవారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. దాదార్లోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో సాయంత్రం 3 గంటలకు శ్యామ్ బెనెగల్ భౌతిక కాయానికి అంత్యక్రియలు ముగిశాయి.
పలువురు సినీ ప్రముఖులు హాజరై నివాళులు అర్పించారు. శ్యామ్ బెనెగల్ సోమవారం తన 90వ ఏట ఓ ప్రైవేట్ దవాఖానలో కిడ్నీ సంబంధిత వ్యాధితో కన్నుమూశారు.