Shruti Haasan : దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై నటి శృతిహాసన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను ట్యాగ్ చేస్తూ ట్విటర్లో ఒక పోస్టు పెట్టింది. తాను సాధారణంగా ఫిర్యాదులు చేయనని, కానీ రానురాను ప్రయాణికులకు సేవలు అందించడంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ దిగజారుతోందని శృతిహాసన్ తన ట్వీట్లో పేర్కొంది.
తాను, తనతోపాటు పలువురు ప్రయాణికులం ఎయిర్‌పోర్టులో విమానం కోసం ఎదురుచూస్తూ ఉండిపోయామని, ఎయిర్‌లైన్స్ సిబ్బంది కనీసం విమానం ఆలస్యమవుతోందనే సమాచారం కూడా ఇవ్వలేదని శృతిహాసన్ విమర్శించారు. ఇకనైనా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఎయిర్‌లైన్స్ సంస్థ తన సేవలను మెరుగుపర్చోకోవాలని సూచించారు.
శృతిహాసన్ ట్వీట్‌పై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం ఆలస్యమైందని, ఈ విషయాన్ని శృతిహాసన్ అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని ఇండిగో తన రిప్లేలో పేర్కొంది. ఇండిగో సమాధానంపై పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ప్రతికూల వాతావరణం ఉంటే ప్రయాణికులకు సమాచారం ఇవ్వడంలో ఇబ్బంది ఏముందని ప్రశ్నిస్తున్నారు.