అయోధ్య: యూపీలోని అయోధ్యలో రామ మందిరాన్ని(Ayodhya Ram Temple) నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తాజాగా కొత్త ఫోటోలను రిలీజ్ చేసింది. మందిరానికి చెందిన గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి అయినట్లు ఆ ఫోటోల ద్వారా తెలుస్తోంది. 2024, జనవరి ఒకటో తేదీ వరకు ఆలయాన్ని ప్రారంభించాలన్న సంకల్పంతో ట్రస్టు ఉన్నట్లు తెలుస్తోంది. దానికి తగినట్లే పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయి. కిటికీలు, దర్వాజలు ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 24వ తేదీ నుంచి సాధారణ ప్రజలకు శ్రీరాముడి దర్శనం ఉంటుందని భావిస్తున్నారు.
जेहि कें जेहि पर सत्य सनेहू।
सो तेहि मिलइ न कछु संदेहू॥ pic.twitter.com/7L4GAuVUbQ— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) July 21, 2023