Cow Birth Certificate | ఆవుల బర్త్ సర్టిఫికెట్లు చూపండి.. బీజేపీ ఎమ్మెల్యే వింత వాదన
Cow Birth Certificate | ఆవులతో వెళ్తున్న ఒక వాహనాన్ని అడ్డుకొని వాటి జనన ధ్రువీకరణ పత్రాలు చూపాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర చేసిన డిమాండ్‌పై విమర్శలు రేకెత్తాయి.
Cow Birth Certificate | కోల్‌కతా: ఆవులతో వెళ్తున్న ఒక వాహనాన్ని అడ్డుకొని వాటి జనన ధ్రువీకరణ పత్రాలు చూపాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర చేసిన డిమాండ్‌పై విమర్శలు రేకెత్తాయి. వధ శాలకు అవులను తరలించాలంటే వాటి వయసు 14 ఏండ్లు దాటి ఉండాలని.. ఈ నేపథ్యంలో వాటి జనన ధ్రువీకరణ పత్రాలను చూపాలని శనివారం రేఖా పాత్ర వాహనదారుడిని కోరారు.
హింగల్ గంజ్‌లో గోవుల రవాణా వాహనాన్ని ఆపి వాటిని కిందకు దించారు. కబేళాకు తరలించే పశువుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు రూపొందించిందని చెప్పారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ స్పందిస్తూ.. గతంలో గోవులకు డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కార్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఈ తరహా సర్టిఫికెట్లు జారీ చేసి ఉంటే చూపాలని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

