శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 17:20:10

దేవుడిని కాళ్ల‌తో త‌న్నుతూ టిక్‌టాక్.. ఎంత‌కైనా తెగించేలా ఉన్నారు!

దేవుడిని కాళ్ల‌తో త‌న్నుతూ టిక్‌టాక్.. ఎంత‌కైనా తెగించేలా ఉన్నారు!

ఘోరం, అరాచ‌కం ఇలా ఎన్ని ప‌దాలు ఉన్నా.. అన్నీ వీళ్ల‌కి వ‌ర్తిస్తాయి. టిక్‌టాక్ పిచ్చిలో ప‌డి క‌ళ్లు మూసుకుపోయిన‌ట్లున్నాయి. ఏం చేసినా పాపుల‌ర్ అవ్వ‌డం లేద‌ని దేవుడి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. వ‌చ్చింది దేవుడిని వేడుకోవ‌డానికి కాదు. కాళ్ల‌తో త‌న్ని టిక్‌టిక్ వీడియో చేయ‌డానికి. ఇలా చేస్తే క్ష‌ణాల్లో ఫేమ‌స్ అయిపోవ‌చ్చు అనుకున్నారు కాని, క‌ట‌క‌టాల మ‌ధ్య‌లో ఉండాల్సి వ‌స్తుంద‌ని ఊహించ‌లేక‌పోయారు.

గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక దేవాల‌యం ఉంది. అక్క‌డ జయేష్ చుదాస్మా (27), దినేష్ మహిందా (25) అనే యువకులు గుడిలోని నంది విగ్ర‌హాన్ని త‌న్నుతూ టిక్‌టాక్ వీడియో షూట్ చేశారు. వీరిలో జ‌యేష్ నంది విగ్ర‌హాన్ని త‌న్నుతూ ఫోజ్ ఇచ్చాడు. బ‌లంగా త‌న్న‌డంతో విగ్ర‌హం ధ్వంస‌మైంది. ఇప్పుడు ఈ వీడియో వాట్సాప్‌లో వైర‌ల్‌గా మార‌డంతో అక్క‌డి స్థానికులు గుర్తించి యువ‌కుల‌పై ఫోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వీరువురిని బుధ‌వారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. భార‌త్‌లో టిక్‌టాక్ బ్యాన్ చేసిన‌ప్ప‌టికీ ఈ వీడియోను కొన్నిరోజుల ముందే షూట్ చేసిన‌ట్లు యువ‌కులు చెప్పుకొచ్చారు. త‌ప్పైపోయింది, క్ష‌మించండంటూ ఇప్పుడు వేడుకుంటున్నారు. 'అయ్యో.. ఇంత క‌ష్ట‌ప‌డి వీడియో షూట్ చేశారు. ఫేమ‌స్ కాక‌ముందే టిక్‌టాక్ బ్యాన్ చేశారే' అంటూ నెటిజ‌న్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. 


logo