బరేలీ: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో నటి దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. మాజీ ఆర్మీ అధికారిణి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. తామే కాల్పులకు పాల్పడినట్టు గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ పేర్కొన్నారు.