ముంబై, జనవరి 22: రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణం జరిగేవరకు కాళ్లకు చెప్పులేసుకోను.. అంటూ ప్రతినబూనిన ఓ రామభక్తుడి కల నెరవేరింది. ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందిన విలాస్ భవ్సర్ 32 ఏండ్ల తర్వాత తన కాళ్లకు చెప్పులేసుకోవటం వార్తల్లో నిలిచింది. జలగావ్లో పాన్ దుకాణం నడుపుకునే భవ్సర్ 1992లో అయోధ్య ఉద్యమంలో వలంటీర్‌గా పనిచేశాడు. అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన వెంటనే, భవ్సర్.. తన దీక్షను విరమించాడు. మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ చేతులమీదుగా ఒక జత చెప్పులు అందుకొని కాళ్లకు వేసుకున్నాడు.