ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో అత్తింటి ముందు పాతిపెట్టిన యువతి కేసులో దిగ్భ్రాంతికర వాస్తవం వెల్లడైంది. ఆమెను హత్య చేయడానికి ముందు ఆమె మామ ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేలింది. నిందితుడు ఈ విషయాన్ని పోలీసుల విచారణలో అంగీకరించాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఏప్రిల్ 14న బాధితురాలి హత్యకు పథకాన్ని ఖరారు చేశారు. ఈ ప్లాన్ అమలు చేయడంలో భాగంగా ఆమె అత్తను పెండ్లి నెపంతో యూపీలోని ఎటాకు పంపారు. అదే నెల 21వ తేదీ రాత్రి బాధితురాలి భర్త నిద్ర మాత్రలు కలిపిన భోజనాన్ని ఆమెకు, ఆమె సోదరికి వడ్డించారు. ఆ తర్వాత వారిద్దరూ వేర్వేరు అంతస్తుల్లోని గదుల్లో నిద్రపోతూ అచేతనంగా మారిపోయారు. ఆ తర్వాత బాధితురాలి మామ ఆమెపై లైంగిక దాడి చేసి ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత అతడు తన కొడుకును పిలిచి అతడి సాయంతో అంతకు ముందే ఇంటి ముందు సిద్ధం చేసిన గోతిలో కోడలి శవాన్ని పూడ్చి పెట్టాడు. కోడలిపై లైంగిక దాడి విషయాన్ని అతడు తన భార్య, కొడుకుకు ఆ సమయంలో వెల్లడించలేదు.