రాంచీ, అక్టోబర్ 22: జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు బీజేపీకి షాక్ తగిలింది! మాజీ ఎమ్మెల్యేలు లుయీస్ మరాండీ, కునాల్ సారంగి, లక్ష్మణ్ తుడు సహా పలువురు పార్టీ నాయకులు సోమవారం జేఎంఎంలో చేరారు. మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేసిన కేదార్ హజ్రా, ఏజేఎస్‌యూ పార్టీ నేత ఉమాకాంత్ రజక్ జేఎంఎంలో చేరిన రెండు రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది. లుయీస్ మరాండీ 2014లో సీఎం హేమంత్ సొరేన్‌ను ఓడించారు. నిబద్ధత కలిగిన తన లాంటి పనిచేసేవారిని నిర్లక్ష్యం చేశారని, పార్టీలో ముఠాతత్వం పెరిగిందని లుయీస్ మరాండీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి రాసిన లేఖలో పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.