న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ నిండా ముంచుతున్నారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. కాంగ్రెస్లో రాహుల్ ఉన్నంతకాలం బీజేపీ శ్రమించాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. పటిష్టంగా ఉన్న పంజాబ్ సర్కార్ను రాహుల్ చేజేతులా నాశనం చేశారని దుయ్యబట్టారు.
సిద్ధూ కోసం సీఎం పీఠం నుంచి అమరీందర్ సింగ్ను తొలగించారని, ఇప్పుడు సిద్ధూ సైతం పారిపోయాడని చౌహాన్ వ్యాఖ్యానించారు. కాగా పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్ని సిద్ధూ వ్యవహారంపై స్పందించారు. తాను సిద్ధూతో ఫోన్లో మాట్లాడానని కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా అన్ని విషయాలూ పరిష్కరించుకుందామని ప్రతిపాదించానని చెప్పారు.