ప్రయాగ్రాజ్: ప్రయాగ్రాజ్లో మాఘమేళా జరుగుతోంది. ప్రజలు పవిత్ర స్నానాలు చేస్తున్నారు. గంగా నది తీరంలో రుద్రాక్షలతో శివలింగాన్ని(Rudraksha Shivling) ఏర్పాటు చేశారు. మహాదేవుడి దీవెనలతో పవిత్ర ప్రయాగ్రాజ్లో రుద్రాక్షలతో జ్యోతిర్లింగాన్ని ఏర్పాటు చేసినట్లు అభయ్ చైతన్య మౌని మహారాజ్ తెలిపారు. సుమారు 11 ఫీట్ల ఎత్తు, 9 ఫీట్ల పొడుగు ఉన్నది. ఆ శివలింగం ఏర్పాటు కోసం సుమారు 5.51 కోట్ల రుద్రాక్షలను వాడారు. 5.51 కోట్ల సార్లు పంచాక్షరీ మంత్రాన్ని పఠించారు. ఆ జ్యోతిర్లింగ ఏర్పాటు ప్రాంతంలో సుమారు 11 వేల త్రిశూలాలను కూడా ఫిక్స్ చేశారు.
జాతీయ భద్రత కోసం ప్రత్యేక పూజను నిర్వహిస్తున్నట్లు మౌనీ మహారాజ్ చెప్పారు. ఆధ్యాత్మిక కేంద్రాలైన అయోధ్య, కాశీ, మథురలో పునర్ నిర్మాణాలు జరిగాయని, ఉగ్రవాదాన్ని ప్రభుత్వం అణిచివేసిందన్నారు. బంగ్లాదేశ్లో హిందువులను రక్షించాలని, గంగా నది నిరంతరం ప్రవహిస్తూ ఉండాలని, గోవుల సంహారం ఆగాలని, బ్రూణహత్యలు నిలిచిపోవాలని కోరుతూ రుద్రాక్ష శివుడికి పూజ చేస్తున్నట్లు మౌనీ మహారాజ్ తెలిపారు.
#WATCH | Prayagraj, UP: Abhay Chaitanya Mauni Maharaj says, “By the grace of Lord Mahadev, in the holy city of Prayagraj, a divine Jyotirlinga of Lord Shiva, 11 feet high, 9 feet long… has been established with 5 crore 51 lakh sacred mantras and 5.51 crore Rudraksha beads.… pic.twitter.com/SbgvYVoIiW
— ANI (@ANI) January 14, 2026