ముంబై, ఏప్రిల్ 17: ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ సమాజంలో మతచిచ్చు రేపి దేశాన్ని విభజించాలని చూస్తున్నదని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ మండిపడ్డారు. శ్రీరామనవమి నాడు దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలు రాముడి ఆలోచనలను అవమానించడమేనని అన్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఖార్గోన్లో జరిగిన ఘటనలను ఆ రాముడు కూడా సహించలేడని సామ్నా పత్రిక ఎడిటోరియల్‌లో పేర్కొన్నారు. ముంబైలో శివసేన నిర్వహించే హిందూ ర్యాలీపై దాడులు జరగవని, అయితే బీజేపీ, దాని బీ-టీం సంస్థల ర్యాలీలపై మాత్రమే జరిగే దాడులు చూస్తుంటే, ఆ విధంగా ప్లాన్ చేసుకున్నట్టు అనిపిసున్నదని విమర్శించారు. మరోవైపు దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు బీజేపీయేతర ముఖ్యమంత్రులు త్వరలో ముంబైలో సమావేశమవుతారని తెలిపారు.