Home
National
Shiv Sena Mla Sanjay Gaikwad Sparks Outrage With Controversial Remarks On Suicidal Farmers
బలవన్మరణ రైతుల అంత్యక్రియలకు వెళ్లకండి
మహారాష్ట్రలో ఆత్మహత్య చేసుకున్న రైతులను ఉద్దేశించి శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుల్దానాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతులు అంత్యక్రియలకు ఎవరూ హాజరు కావద్దని వ్యాఖ్యానించారు.
- శివసేన ఎమ్మెల్యే వ్యాఖ్యలు
ముంబై : మహారాష్ట్రలో ఆత్మహత్య చేసుకున్న రైతులను ఉద్దేశించి శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుల్దానాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతులు అంత్యక్రియలకు ఎవరూ హాజరు కావద్దని వ్యాఖ్యానించారు. వారి మృతదేహాలను జంతువులు తినే పరిస్థితి వస్తే , ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఇతరులు దాని పరిణామాలను అర్థం చేసుకుని, అటువంటి నిర్ణయం తీసుకోరని అన్నారు.
రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేదా ప్రభుత్వాన్ని సంప్రదించాలని, అంతేగానీ ఆత్మహత్యలకు పాల్పడకూడదన్నారు. అయితే రైతుల కష్టాలను పట్టించుకోకుండా గైక్వాడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

