Mumbai EVM Controversy : ముంబై ఈవీఎం వివాదం పెను దుమారం రేపుతోంది. ఈ ఉదంతంపై శివసేన నేత సంజయ్ నిరుపమ్ స్పందిస్తూ శివసేన (యూబీటీ) వాయువ్య ముంబై సీటును కేవలం 48 ఓట్లతో కోల్పోయిందని, ఈ విషయాన్ని ఈవీఎంలపై ఆరోపణలు గుప్పించేవారు అంగీకరించాలని అన్నారు.
సంజయ్ రౌత్ ప్రతిరోజూ అసత్యాలు ప్రచారం చేస్తారని, ఆయన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు తనను ప్రశ్నించడం సరైంది కాదని చెప్పారు. వాయువ్య ముంబైలో ఈవీఎంలు హ్యాక్ అయితే, దక్షిణ మధ్య ముంబైలోనూ, ఈశాన్య ముంబైలోనూ హ్యాక్ అవుతాయని అన్నారు.
ముందుగా వారి పార్టీ నుంచి గెలుపొందిన ఇద్దరు, ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయాలని అప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడాలని అన్నారు. ఈవీఎంలపై అసత్యాలు చెబుతున్న సంజయ్ రౌత్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై వ్యాఖ్యలు చేసిన ఆదిత్య ఠాక్రే కూడా క్షమాపణ చెప్పాలని ఆయన పేర్కొన్నారు.
Read More :
Ayyannapatrudu | ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు.. జనసేనకు డిప్యూటీస్పీకర్!