ముంబై: మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గోవా నుంచి ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసేందుకు ఎయిర్పోర్ట్ నుంచి తన కాన్వాయ్‌లో బయలుదేరారు. దీంతో షిండే కాన్వాయ్‌కు దారి ఇచ్చేందుకు హైవేపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి, వచ్చే ప్రయాణికుల వాహనాలు నిలిచిపోయాయి. చేసేదేమీ లేక కొందరు తమ వాహనాలను వీడి లగేజ్‌తో కాలినడకన ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు.
కాగా, ముంబైకి చేరిన ఏక్నాథ్ షిండే తొలుత బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అవుతారు. అనంతరం వారిద్దరూ కలిసి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారీని కలుస్తారు. ప్రభుత్వం ఏర్పాటు గురించి చర్చిస్తారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర 20వ సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ షిండే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తున్నది. మరోవైపు ఏక్నాథ్ షిండే ఇప్పటికీ శివసేన శాసనసభా పక్ష నాయకుడేనని ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్కార్ తెలిపారు. ఆయనకు మద్దతిచ్చిన శివసేన మిగతా రెబల్స్ ఎమ్మెల్యేలు గోవా హోటల్లోనే ఉన్నారు.
#WATCH | Maharashtra Shiv Sena MLA Eknath Shinde arrived at Mumbai airport from Goa.#MaharashtraPoliticalCrisis pic.twitter.com/qW10YzE2rw
— ANI (@ANI) June 30, 2022