ముంబై ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు చెందిన రూ.98 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అటాచ్ చేసింది. క్రిప్టో అస్సెట్స్ పోంజీ స్కీమ్ కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణపై ముంబైలోని జుహూలో శిల్పాశెట్టి పేరుపై ఉన్న ఒక బంగ్లా, పుణెలోని ఒక ఫ్లాట్, కుంద్రా పేరుపై ఉన్న ఈక్విటీ షేర్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలిపింది.
వీటి మొత్తం విలువ రూ.97.79 కోట్లని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండు చార్జిషీట్లు దాఖలు చేశామని, కేసులో నిందితులైన భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్‌లను అరెస్ట్ చేసి జైలుకు పంపామని, మరికొందరు పరారీలో ఉన్నారని ఈడీ అధికారులు తెలిపారు