న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్‌గా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఎన్నికయ్యారు. బుధవారం మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు రెండో టర్మ్ ఎన్నికలు జరగగా, బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
దీంతో ఒబెరాయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆప్‌కు చెందిన మహమ్మద్ ఇక్బాల్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.