ముంబై: మహారాష్ట్రలో 12 ఏళ్ల కిందట కలకలం రేపిన షీనా బోరా హత్య కేసు కట్టుకథ అని, ఆమె తల్లి, ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జీ అన్నారు. (Sheena Bora murder case) షీనా బోరా ఎముకలు, అవశేషాల ఆధారాల ప్యాకెట్లు కనిపించడం లేదని కోర్టుకు సీబీఐ వెల్లడించడంపై ఆమె స్పందించారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో ఇంద్రాణి మాట్లాడారు. 2012 మేలో షీనా బోరాకు సబంధించిన ఎలాంటి అవశేషాలను కనుగొనలేదని తెలిపారు. సీబీఐ వంటి ప్రధాన ఏజెన్సీ కస్టడీ నుంచి కీలకమైన ఇలాంటి సాక్ష్యం మాయం కావడం చాలా కష్టమని అన్నారు. కాబట్టి ఇదంతా ఒక కల్పిత కథ అని ఆరోపించారు. పలు ఏజెన్సీల దర్యాప్తులతో కేసు విచారణ పక్కదారి పట్టిందని ఇంద్రాణి విమర్శించారు. సమయం మించిపోతుండటంతో తనపై అభియోగాలు మోపేందుకు దర్యాప్తు సంస్థలు తొందరపడుతున్నాయని ఆరోపించారు.
కాగా, షీనా బోరా అవశేషాలకు సంబంధించిన డీఎన్ఏ నివేదిక చట్టబద్ధతను ఇంద్రాణి అనుమానించారు. ఒక డీఎన్ఏ నిపుణుడు ప్రింటెడ్ కోఆర్డినేట్లను ఎందుకు కత్తిరించాల్సి వచ్చింది? అని ప్రశ్నించారు. డీఎన్ఏ రిపోర్ట్‌ను మార్పు చేసిన వ్యక్తులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని ఆమె డిమాండ్ చేశారు.
మరోవైపు షీనా బోరా ప్రియుడు రాహుల్ ముఖర్జీపైనా ఇంద్రాణి అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను చివరిసారిగా చూశానని చెప్పిన అతడ్ని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని అన్నారు.
#WATCH | Sheena Bora murder case | Indrani Mukerjea says, "In my personal view, I think no skeleton remains were ever discovered in 2012 May. It was all a concocted story because it is very difficult to accept that from the custody of a premier agency like CBI, this form of… pic.twitter.com/lpXsGbEGzb
— ANI (@ANI) June 16, 2024