మీరట్ : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన మహమ్మద్ సగిర్ ఏడు నెలల క్రితం అర్షిని పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు అతని గడ్డం నచ్చలేదు. దానిని తొలగించాలని ఆమె చాలాసార్లు చెప్పింది. ఈలోగా ఆమెకు తన భర్త తమ్ముడు సబిర్తో సాన్నిహిత్యం పెరిగింది. సబిర్ గడ్డం గీసుకుని, అందంగా కనిపిస్తాడు. సబిర్, అర్షి ఫిబ్రవరిలో ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. ఇదిలావుండగా, అర్షి బుధవారం సబిర్ను తీసుకుని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. సగిర్తో తాను ఇక జీవించలేనని, సబిర్ను పెండ్లి చేసుకుంటానని చెప్పింది. సగిర్ గడ్డం గురించి తనకు ఇబ్బంది లేదని, అతను లైంగికంగా అసమర్థుడని తెలిపింది. దీంతో సగిర్ పోలీసుల సమక్షంలోనే అర్షికి విడాకులిచ్చేశాడు.