న్యూఢిల్లీ, మే 16: కాంగ్రెస్ నేత శశి థరూర్‌కు కేంద్రంలోని బీజేపీ పెద్ద పీట వేయనుంది. పాకిస్థాన్ ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన బృందాల్లో శశి థరూర్‌కు అగ్ర స్థానం కల్పించనున్నట్టు తెలిసింది. ఉగ్రవాదానికి, ఉగ్రవాదుల తయారీకి ఫ్యాక్టరీగా మారిన పాకిస్థాన్ అరాచకాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నది.
అయితే శశి థరూర్ బహుళ పార్టీల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి పలు ప్రపంచ దేశాలలో తమ గళం వినిపిస్తారని భావిస్తున్నారు. ఈ ప్రతినిధి బృందానికి శశి థరూర్ నాయకత్వం వహిస్తారని తెలిసింది.